SKLM: కంచిలి మండలం కొల్లూరు పంచాయతీ అంగన్వాడీ-1, అంగన్వాడీ-2 కేంద్రాలను ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న భోజన వసతులు, పోషకాహార సరఫరా, పిల్లల బోధన కార్యక్రమాలు తదితర అంశాలను పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యాభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర కీలకమని తెలిపారు.