PDPL: ధర్మారం మండల నూతన ఇంఛార్జ్ వ్యవసాయ అధికారిగా కే. ప్రకాష్ ఇవాళ బిర్రు భాస్కర్ నుంచి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సహాయ సంచాలకులు శ్రీనాథ్, ఏఈవోలు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. మండలంలో రైతు సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటానని ప్రకాష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు శ్రీనాథ్, ఏఈవోలు పాల్గొన్నారు.