MDCL: మీ మధ్యే ఉంటాం..తేడా వస్తే మీ అంతు చూస్తామని మల్కాజ్గిరి షీ టీం బృందం అంటున్నారు. మల్కాజ్గిరి, అల్వాల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో బస్టాపులు, ప్రతి ప్రాంతాల్లో సాధారణ జనం వలె నిలబడి ఉంటారు. ఒకవేళ మహిళలను అసభ్యంగా తాకటం, కన్ను కొట్టడం, వేధించడం లాంటివి చేస్తే, అక్కడే పసిగట్టి మీ భరతం పడతారు. ఇలా ఇప్పటికే 4 నెలల్లో 54 మంది పై చర్యలు చేపట్టారు.