EG: రాజమహేంద్రవరం మున్సిపల్ స్కూల్స్లో ఉచిత సమ్మర్ క్యాంప్స్ను పునఃప్రారంభిస్తున్నట్టు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ నుండి ప్రారంభంకానున్న ఈ శిబిరాల్లో యోగా, క్రీడలతో పాటు ఆడబిడ్డల ఆత్మరక్షణ కోసం ప్రత్యేకంగా సెల్ఫ్ డిఫెన్స్ (ఆత్మరక్షణ) శిక్షణ అందించబడుతుందన్నారు. 6సంవత్సరాల తరువాత ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.