KDP: రాజంపేట, పులివెందుల పోలీసులతో గురువారం ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ నేర సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణే లక్ష్యంగా పగలు, రాత్రి గస్తీతో పాటు విజిబుల్ పోలీసింగ్ పెంచాలని ఆదేశించారు. గంజాయి, బెల్టు షాపులు, క్రికెట్ బెట్టింగ్లు, బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణకు తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు.