PLD: అన్ని శాఖలు కీ ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌లో 100% లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. సమీక్ష సమావేశంలో శాఖల పనితీరును పరిశీలించారు. జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలన్నారు. ప్రతి శాఖ ‘A+’ గ్రేడ్ సాధించాలని సూచించారు. 2026-27లో 396 సూచికల్లో మెరుగైన ఫలితాలు ఇవ్వాలని చెప్పారు. 199 సూచికల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు.