ADB: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామి అన్నారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో అమరులైన వారి చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రవీందర్, సామనపల్లి నర్సింలు పాల్గొన్నారు.