HYD: ఉస్మానియా ఆసుపత్రిలో షుగర్ పేషెంట్లకు ప్రత్యేకంగా చెప్పులు అందజేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సేవలు కొనసాగుతున్నాయని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అనునిత్యం సుమారుగా 300 నుంచి 400 మంది డయాబెటిక్ ఫుట్ వేర్ కోసం వస్తున్నట్లుగా డాక్టర్లు తెలిపారు. గత రెండేళ్లలో 2000 మంది న్యూరోపతి రోగులకు వైద్యం అందించారు.