CTR: ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం ద్వారా రాయితీతో సోలార్ రూఫ్ టాఫ్ నిర్మించుకోవడం పై మరింత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం అమలుకు సంబంధించి ట్రాన్స్ కో, నెడ్ క్యాప్, జిల్లా పరిషత్, రెస్కో, డిఆర్డిఏ, సంబంధిత అధికారులతో సమీక్షించారు.