కృష్ణా: విజయవాడ బైపాస్‌పై వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గుర్తుతెలియని వాహనాలు ఢీకొట్టి పరారయ్యే ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గొల్లపూడి నుంచి చిన్న అవుటపల్లి వరకు బైపాస్ మార్గంలో సీసీ కెమెరాల లేమి ప్రధాన సమస్యగా మారింది. అండర్‌పాస్‌లు, అనుసంధాన రోడ్ల వద్ద నిఘా లేక నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులు తప్పించుకుంటున్నారు.