NLG: చిట్యాల పురపాలిక కో- ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు సమయం నేటితో ముగిసింది. ఒకసారి నలుగురు సభ్యుల ఎన్నిక కోసం మొత్తం 23 నామినేషన్లు వచ్చినట్లు మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ రంజిత్ కుమార్ తెలిపారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి తొమ్మిది నామినేషన్లు ఇతరుల నుంచి 14 నామినేషన్లు వచ్చినట్లు వివరించారు.