NZB: పెరుగుతున్న ఎండల దృష్ట్యా ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. వేసవిలో ప్రజలు డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.