AP: వైసీపీ అధినేత జగన్పై మంత్రి ఆనం రామనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఐదేళ్లలో ప్రజలపైనే కాదు ఆలయాలపైనా దాడులు జరిగాయి. రామతీర్థం మొదలు దుర్గమ్మ ఆలయం వరకు.. అన్ని ఆలయాల్లో ఎన్నో అపచారాలు చేశారు. మేం వచ్చాక ఆలయాల్లో రాజకీయ ప్రమేయం తగ్గించాం. ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు చేయిస్తున్నాం. దేవాదాయశాఖలో ఇచ్చిన 98 శాతం హామీలు అమలు చేశాం’ అని పేర్కొన్నారు.