TG: నాగర్కర్నూల్లో మాజీమంత్రి KTR పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుమ్మెర జాతర ఘటన బాధితుల దీక్షాస్థలికి చేరుకున్నారు. బాధితులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. ఇది మాటలకందని మహా విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం కాదని.. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడాలని సూచించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.