ELR: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఎస్పీ ప్రతాప్ కిషోర్ 38 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన అర్జీలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. అర్జీలు రీఓపెనింగ్ కాకుండా చూడాలని తెలిపారు.