నటన, గ్లామర్‌తో ఆకట్టుకుంటున్నా భామ భాగ్యశ్రీ బోర్సేకు లక్ కలిసిరావడం లేదు. ‘మిస్టర్ బచ్చన్’తో క్రేజ్ తెచ్చుకున్నా, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, రామ్ ‘ఆంధ్రా కింగ్’ వంటి చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం అఖిల్ అక్కినేని ‘లెనిన్’పైనే ఈమె ఆశలన్నీ ఉన్నాయి. జూన్ 26న విడుదల కానున్న ఈ సినిమా హిట్ అయితేనే భాగ్యశ్రీ కెరీర్ మలుపు తిరుగుతుంది.