KRNL: ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్ వద్ద ఇవాళ బీజేపీ నేతలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల తీరును ఖండిస్తూ నిరసన చేపట్టారు. పట్టణ అధ్యక్షుడు దయాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళల రాజకీయ భాగస్వామ్యానికి ఈ బిల్లు కీలకమని నేతలు పేర్కొన్నారు. మహిళా సాధికారతకు మద్దతు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు.