సత్యసాయి: జిల్లాలో ఈ నెల 25న నిర్వహించనున్న పాలిసెట్ పరీక్షా ఏర్పాట్లపై కలెక్టరేట్లో డీఆర్వో విజయసారధి సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, హిందూపురం, కదిరి ప్రాంతాల్లోని 17 కేంద్రాల్లో 5,594 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని, తాగునీటి వసతిని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.