NGKL: తమకు రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అమ్రాబాద్‌లో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. పీఆర్సీ, డీఏల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి, వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.