TG: ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం సేకరణ అంశంపై వారు కేంద్రమంత్రితో చర్చించారు. ధాన్యం సేకరణపై పరిమితులు విధించొద్దని కోరారు.