MBNR: జాతీయ ఎస్సీ కార్పొరేషన్ సభ్యులు జాతోత్ హుస్సేన్ గురువారం రాత్రి జాల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద కలెక్టర్ కుష్బూ గుప్తా ఆయనకు బొకే అందించి ఘన స్వాగతం పలికారు. నేడు ఆయన మహబూబ్నగర్ రూరల్ మండలం లాల్య నాయక్ తండ, రామ్ నాయక్ తండలలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.