JGL: ధర్మారంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఇవాళ ప్రశాంతంగా ప్రారంభమైంది. రెండు కేంద్రాలలో 571 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేంద్రం లోపలికి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.