WGL: భద్రకాళి ఆలయంలో యేటా నిర్వహించే దేవీ శరన్నవరాత్రి వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు బుధవారం అంకురార్పణ జరిగింది. ఉదయం అమ్మవారిని హరిద్ర లేపనం నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు వైదిక క్రతువు నిర్వహించారు. నిత్యం అమ్మవారిని ఒక్కో అలంకారంతో వేడుకలు నిర్వహించనున్నారు.