NLG: వేసవి సెలవుల దృష్ట్యా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై నరేష్ సూచించారు. పిల్లలు సరదా కోసం ప్రమాదకరమైన బావులు, కాలువలు, రిజర్వాయర్లు, వాగుల వద్దకు ఈతకు వెళ్లకుండా చూడాలని కోరారు. నీటి వనరుల వద్ద అజాగ్రత్తగా ఉంటే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు.