BDK: అశ్వరావుపేట నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగ్గారం, మల్లారం విద్యుత్ ఉపకేంద్రాలు కీలకమని కలెక్టర్ అంకిత్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వీటి ద్వారా సుమారు 4 వేల మంది రైతులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ముఖ్యంగా వేసవి కాలంలో లో- వోల్టేజ్, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు.