HNK: హన్మకొండ నగరంలోని ఆప్టికల్ షాపులు అర్హత కలిగిన కంటి వైద్య నిపుణుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే కంటి అద్దాలు ఇవ్వాలని డీఎంహెచ్ అప్పయ్య సూచించారు. బుధవారం నగరంలోని పలు పలు షాపుల్లో తనిఖీల సందర్భంగా ఆప్టికల్ షాపులు కంటి దవాఖానల బోర్డులు పెట్టకూడదని తెలిపారు. అర్హత కలిగిన డాక్టర్ లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.