TG: ప్రముఖ యూట్యూబర్ కోమలి(21) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మణికొండ చిత్రపురి కాలనీలోని తన మామ ఇంట్లో ఉంటున్న ఆమె, మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోమలి గత మూడేళ్లుగా అఖిల్ రెడ్డి అనే మరో యూట్యూబర్‌తో ప్రేమలో ఉన్నారు. వీరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.