టీమిండియా ప్లేయర్ రింకూ సింగ్ టీ20 ప్రపంచకప్ మధ్యలోనే ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా అతడు ఇంటికి వెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన టీమిండియా ట్రైనింగ్ సెషన్‌కు అతడు హాజరు కాలేదు. రింకూ తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. పరిస్థితి విషమంగా ఉండటంతో అతడు వెంటనే వెళ్లాల్సి వచ్చిందని సమాచారం.