ADB: నక్సలైట్లు హింస మార్గాన్ని విడిచిపెట్టి సమాజంలో కలిసి సాధారణ జీవితాన్ని గడపాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఉట్నూర్ మండల కేంద్రంలో గతంలో లొంగిపోయిన మాజీ నక్సలైట్ సభ్యులతో సమావేశమై మాట్లాడారు. లొంగిపోయిన వారికి గృహ స్థలాలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం, విద్యా సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.