అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ తను ఓడిపోతే, తర్వాత ఎన్నికల్లో పోటీ చేయనని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను తను కట్టుబడి ఉంటానని తెలిపారు. అయితే ఈ ఎన్నికల్లో తను భారీ మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.