KMM: జిల్లాలో కోతుల బెడద రోజురోజుకి పెరుగుతుంది. చింతపల్లిలో సైబీరియన్ కొంగలగూళ్లను ధ్వంసం చేస్తుండటంతో అతిథి పక్షుల రాక కరువైంది. రెండు రోజుల క్రితం కొణిజర్ల మండలం లాలాపురంలో కోతులను తరుముతూ కిందపడి రైతు శ్రీనివాసరావు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలు, పొలాలు అనే తేడా లేకుండా వానరాలు దండయాత్ర చేస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు.