NLG: ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరవేయడంలో యువత చురుకైన పాత్ర పోషించాలని నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి పిలుపునిచ్చారు. చిట్యాల మండలం వెలిమినేడులో ఆదివారం జరిగిన యువజన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడారు. యువతే పార్టీకి బలమని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పార్టీని బలోపేతం చేయాలన్నారు.