ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ మృతి చెందినట్లు ఆ దేశ వర్గాలు తెలిపాయి. గాజాలో శనివారం స్కూల్‌పై జరిపిన రాకెట్ దాడిలో అతడు చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించాయి. సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో హమాస్ కమాండ్ సెంటర్ పూర్తిగా ధ్వంసమైంది.