TG: ఈరోజు చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా ఓ ప్రకటన విడుదల చేసింది. కూకట్పల్లి పరిధి నల్లచెరువులో నిర్మించిన అనధికార షెడ్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. నల్లచెరువులోని సర్వే నంబర్ 66, 67, 68, 69లోని మొత్తం 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలు కూల్చామని పేర్కొంది ఈ కూల్చివేతలతో 4 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. కాగా నగరంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.