AP: తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. TTD పరీక్షల్లో లడ్డూలో కొవ్వు ఆనవాళ్లు లేవని, ఆవులు తినే ఆహారాన్ని బట్టి పాలల్లో ఆ లక్షణాలు ఉంటాయన్నారు. ల్యాబ్ రిపోర్టులో నెగిటివ్ వచ్చినా చంద్రబాబు మాత్రం లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాస్తానని సజ్జల పేర్కొన్నారు.