gold rate : క్రమంగా దిగి వస్తున్న వెండి, బంగారం ధరలు
బంగారం, వెండి లోహాలను కొనుక్కోవాలని చూసే వారికి శుభవార్త. ఈ రెండు లోహాల ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి.
7 types of Gold investment in 2024: ETFs to mining stocks and more
Gold Rate Today : బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. నగల్ని కొనుక్కోవాలని చూసే వారు ఈ ట్రెండ్‌ని గమనిస్తూ ఉండటం అత్యవసరం. అప్పుడే కాస్త ధర తగ్గినప్పుడు పసిడిని కొనుక్కునే ఆస్కారం ఉంటుంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి రెండు రోజుల నుంచి మాత్రం తగ్గుముఖం పట్టింది. శనివారం రూ.650 తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర((gold rate) రూ.75,340కి చేరుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ పసిడి ధరలు దాదాపుగా ఇలాగే ఉన్నాయి. ప్రొద్దుటూరు, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ల్లోనూ రూ. 75,340గానే కొనసాగుతున్నాయి. అయితే ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవి మాత్రమే. ఆ తర్వాత మళ్లీ మారే అవకాశాలు ఉంటాయి. అలాగే నగల కొనుగోలుదారులు మరో విషయాన్ని సైతం దృష్టిలో ఉంచుకోవాలి. ఆభరణాలను కొనుగోలు చేసేప్పుడు బంగారం ధరతో పాటు, రాళ్లు, జీఎస్టీ, మజూరీల్లాంటి వాటినీ చెల్లించాలసి ఉంటుంది.
ఇక దేశీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పైపైకి వెళ్లిన వెండి ధరలు(silver rates) వరుసగా మూడో రోజూ భారీగా తగ్గుముఖం పట్టాయి. శనివారం రూ.1,148 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.91,446కు చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు సైతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నేడు ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 25 డాలర్లు తగ్గి 2401 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి 29.23 డాలర్లుగా ఉంది.