NLG: ఈనెల 19న నిర్వహించనున్న ఫూలే అంబేడ్కర్ జనజాతరను జయప్రదం చేయాలని KVPS జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను పిలుపునిచ్చారు. శుక్రవారం హాలియాలోని సుందరయ్య భవనంలో కార్యక్రమ కరపత్రాలను ఆయన ఆవిష్కరించి, సమాజంలో కుల వివక్ష నిర్మూలనకు, సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.