RR: ముదిరాజు కులానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ గాంధీభవన్ ముట్టడికి ముదిరాజ్ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తలకొండపల్లిలో ముదిరాజ్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. పండుగ సాయన్న ముదిరాజ్ జయంతిని రాష్ట్రప్రభుత్వం అధికారికంగా జరిపించాలన్నారు.