»Siddaramaiah Wife A Social Workers Complaint Against The Chief Ministers Wife
CM Siddaramaiah: ముఖ్యమంత్రి సతీమణిపై ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతిపై ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముడా కుంభకోణం కేసులో సీఎంతో పాటు అతని భార్య, ఇతర అధికారులు కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
Siddaramaiah Wife: A social worker's complaint against the Chief Minister's wife
Siddaramaiah Wife: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతిపై ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార కుంభకోణంలో పార్వతితో పాటు మరో ఇద్దరికీ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య, అతని భార్య, ఇతర అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే ముడాపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో మళ్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
ముడా భూకేటాయింపుల్లో పార్వతి హస్తం ఉందని బీజేపీ నేత ఆరోపణలు చేశారు. దీనికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి సతీమణి పార్వతి పేరుతో పంపిణీ చేసిన ప్రత్యామ్నాయ స్థలాల విలువ అసలు భూముల విలువ కంటే ఎక్కువగా ఉండటమే కారణం. అయితే సిద్ధరామయ్య ఈ ఆరోపణను ఖండించారు. 1998లో పార్వతి సోదరుడు మల్లికార్జున ఆమెకు ఈ భూమి ఇచ్చారని తెలిపారు. కానీ ఇది అబద్ధమని, వ్యవసాయ భూమి అని తప్పుడు రికార్డులు సృష్టించారని కార్యకర్త ఆరోపించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రమే కాదు ముడా పరిధిలో రూ.4 వేల కోట్ల విలువైన అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు.