నటి కృతి శెట్టి తాజా ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు కొన్నేళ్ల క్రితమే బ్రేకప్ అయ్యిందని, ఆ విషయం తన తల్లికి కూడా తెలుసని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను సింగిల్గానే ఉన్నానని తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీని తాను అస్సలు సహించనని, అసభ్యంగా ప్రవర్తించే వారిని వెంటనే బ్లాక్ చేస్తానని వెల్లడించింది.