Keshineni Nani: రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన కేశినేని నాని
కేశినేని నాని పొలిటికల్ జర్నీ ముగిసింది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయాలకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు.
Keshineni Nani: ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయాలకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు. తనకు పదేళ్ల పాటు సేవ చేసేందుకు అవకాశమిచ్చిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
కేశినేని నాని పొలిటికల్ జర్నీ ముగిసింది. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేశినేని నాని… తన సొంత తమ్ముడు కేశినేని చిన్నీ చేతిలో ఓటమిపాలయ్యారు. 2 లక్షల 82 వేల మెజార్టీతో చిన్ని గెలుపొందారు. కొన్ని నెలల క్రితం వరకు టీడీపీలో ఉన్న కేశినేని నాని …అధినేత చంద్రబాబుపై అసంతృప్తితో ఆ పార్టీని వీడారు. వైసీపీలో చేరారు. టిక్కెట్ దక్కించుకుని పోటీకి దిగారు. ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. కూటమి హవాలో కొట్టుకుపోయారు. దీంతో విరక్తి చెందిన నాని రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కేశినేని నాని టీడీపీ తరపున రెండు సార్లు ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవలందించారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు. తనకు రెండు సార్లు విజయవాడ ఎంపీగా సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రజలకు కేశినేని నాని కృతజ్నతలు తెలిపారు. తనకు లభించిన గౌరవంగా పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ… విజయవాడ అభివృద్ధికి పాటు పడతానని నాని స్పష్టం చేశారు. విజయవాడ అభివృద్ధికి తాను చేయగలిగినంత చేస్తానని హామీ ఇచ్చారు. తన రాజకీయ ప్రయాణంలో ఇంత కాలం సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో ఎన్ని మరపురాని తీపి గురుతులు ఉన్నాయని నాని గుర్తుచేసుకున్నారు. విజయవాడలో కొత్తగా ఎంపికైన నాయకులందరికీ నాని శుభాకాంక్షలు తెలిపారు.
After careful consideration and reflection I have decided to step away from politics and conclude my political journey. Serving the people of Vijayawada as a Member of Parliament for two terms has been an incredible honor. The resilience and determination of the people of… pic.twitter.com/nlcWFoAdAH