KNR: తిమ్మాపూర్ మండలంలోని అల్గునూరు, నల్లగొండ గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ చిత్రా మిశ్రా, మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. అల్గునూరులో 4 ఎకరాలు, నల్లగొండలో 2.10 ఎకరాల భూమిని పరిశీలించారు. నిరుపేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, అసైన్మెంట్ కమిటీ ఆమోదంతో అమలు చేస్తామన్నారు.