SRD: భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని రేపు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పట్టణంలోని R&B కార్యాలయం పక్కన ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఉదయం 9 గంటలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కల్వకుంట రోడ్డులో భారీ సభ నిర్వహించనున్నారు.