SRPT: తనకున్న మూడు ఎకరాల భూమిని తీసుకున్న ముగ్గురు కుమారులు.. 95 ఏళ్ల కన్నతల్లిని బయటికి గెంటివేసిన ఘటన మోతే మండలం నామవరంలో వెలుగుచూసింది. బాధితురాలు నల్లగంతుల వెంకమ్మ దయనీయ స్థితిపై సమాచారం అందుకున్న తహసీల్దార్ వెంకన్న ఈరోజు ఆమె ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. తల్లి ఆరోగ్య స్థితిపై నిర్లక్ష్యం చేయొద్దని కుమారులను హెచ్చరించి, వృద్ధురాలకి న్యాయం చేస్తామని తెలిపారు.