WGL: రాయపర్తి మండలంలోని పెరికేడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భాషబోయిన సుధాకర్ తండ్రి భాషబోయిన ఆశాలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హనుమకొండలోని శ్రీ బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.