GDWL: అయిజ మండలం కిష్టాపురంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సర్పంచ్ జయమ్మ, భర్త నరేష్ గ్రామస్థులతో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి వినతిపత్రం ఇచ్చారు. శనివారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో కలిసి గ్రామ సమస్యలను వివరించారు. చిన్న గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసే విధంగా పోరాటం చేయాలని కోరారు.