SRPT: నడిగూడెం మండలం గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ మాల్సూర్ తెలిపారు. స్థానిక రైతు వేదికలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ శిక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. శిక్షణకు వచ్చే సభ్యులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో వెంట తీసుకురావాలని సూచించారు.