JGTL: ధర్మపురి పట్టణంలో నిన్న వృద్ధురాలి మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి పుస్తెల తాడు అపహరించిన విషయం తెలిసిందే. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే నిందితుడు చోరీకి పాల్పడడంతో సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, పోలీసులు ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అనుమానితుడిని గుర్తించేందుకు ప్రజలు సహకారించాలని పోలీసులు కోరారు.