NLR: నగర కమిషనర్ వై.ఓ నందన్ శనివారం నగరంలోని 37వ డివిజన్ క్రాంతి నగర్లో పర్యటించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కొత్తగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించారు. నాణ్యత లోపించకుండా కమ్యూనిటీ హాల్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ హాల్ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.