IPL వేళ క్రికెట్ ఫ్యాన్స్‌కు జియో బిగ్ షాకిచ్చింది. తన పాపులర్ రూ.195 క్రికెట్ డేటా ప్యాక్ వ్యాలిడిటీని భారీగా తగ్గించింది. గతంలో 90 రోజులుగా ఉన్న చెల్లుబాటును ఇప్పుడు కేవలం 30 రోజులకు కుదించింది. 15GB డేటా, జియోహాట్‌స్టార్ ప్రయోజనాలు మారనప్పటికీ, వ్యాలిడిటీ తగ్గడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడనుంది. తక్కువ ధరలో ఎక్కువ రోజులు వాడాలనుకునే వారికి ఇది చేదు వార్త.